టాలీవుడ్‌కి తోడు పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఇటీవల వచ్చిన చిత్రాల్లో “కుబేర” ప్రత్యేకంగా నిలిచింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో హీరో ధనుష్, నాగార్జున కీలక పాత్రలు పోషించారు. సినిమా విడుదలైన దగ్గర నుంచి మంచి స్పందన లభించడంతో, తొలి వారం విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు రెండో వారం కూడా అదే జోష్‌లో కొనసాగుతోంది.
ప్రత్యేకంగా శనివారం నుంచి ఈ సినిమా మళ్లీ బాగానే థియేటర్లలో ఆక్యుపెన్సీ రేట్ సాధిస్తోంది. మొదటి ఆట నుంచే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం గమనించదగ్గ విషయం. ఇది చూస్తే కుబేర హవా ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు.
ఇక మ్యూజిక్ విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకి ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది. పాటలు మెలోడి లోనైనా, బీట్స్ లోనైనా ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే హీరోయిన్ రష్మిక మందన్నా, విలన్ పాత్రలో జిమ్ షర్బ్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. కథ, నటన, టెక్నికల్ వ్యాల్యూస్ అన్నీ కలిసి సినిమాను ప్రేక్షకులకు ఒక మంచి ఎక్స్‌పీరియెన్స్‌గా మలిచాయి. దీంతో కుబేర భారీ అంచనాల నడుమ థియేటర్లలో నిలదొక్కుకుంటూ, వరుస విజయాల బాటలో దూసుకెళుతోంది.
