గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ ప్రస్తుతం సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాను దర్శకుడు బుచ్చిబాబు సానా ఎంతో ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కాగా, ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన రాబట్టింది. దాంతోపాటుగా మూవీపై అంచనాలు చాలా భారీ స్థాయికి చేరాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ డీల్ గురించి ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ హక్కులు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందట. అంతే కాకుండా, ఈ రైట్స్ కోసం దాదాపు 105 కోట్ల రూపాయలు చెల్లించినట్టు టాక్ నడుస్తోంది. ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో చాలా సినిమాలకు డిజిటల్ హక్కులు అమ్ముడైనప్పటికీ, ‘పెద్ది’ హక్కులకు వచ్చిన ఈ బంపర్ డీల్ మాత్రం అందరికీ షాక్ ఇచ్చేలా ఉంది.
ఇంత భారీగా డిజిటల్ రేటు దక్కడం వల్లే, ఈ సినిమా ఎక్కడి స్థాయిలో అంచనాలు బేసుకున్నదో మనం ఊహించొచ్చు. ఫస్ట్ లుక్, గ్లింప్స్ చూసినవారికి ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. అన్నింటికీ మించి చరణ్ మాస్ లుక్, కథలోని ఎమోషన్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లేలా కనిపిస్తోంది.
ఇక ఈ ప్రాజెక్ట్‌తో రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర మళ్లీ ఊపు చూపుతాడన్న నమ్మకంతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదల కాకముందే ఇలా భారీ డీల్ క్లోజ్ కావడం చూస్తుంటే, ‘పెద్ది’ ఏ రేంజ్ హిట్ అవుతుందో ఊహించవచ్చు.
