అఘోర లుక్‌ వచ్చేసిందిగా!

Friday, April 4, 2025

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “డాకు మహారాజ్” సెన్సేషనల్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా సక్సెస్ అయ్యిన తర్వాత బాలయ్య వెంటనే అవైటెడ్ సీక్వెల్ చిత్రం “అఖండ 2 తాండవం”. స్టార్ట్ చేసేసారు. తన కం బ్యాక్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు, ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తుండగా షూటింగ్ కూడా ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది.

అయితే ఈ సినిమాలో ప్రస్తుతం బాలయ్య పోషించిన అఘోర లుక్ ఇపుడు బయటకి వచ్చేసింది. కొన్ని సంవత్సరాల కితం బాలయ్య ఏ రీతిలో కనిపించారో ఇపుడు కూడా అదే తరహాలో కనిపిస్తున్నారని చెప్పాలి. సినిమా సెట్స్ నుంచే బయటకి వచ్చిన ఈ పిక్ ఇపుడు బాలయ్య అభిమానుల్లో వైరల్ గా మారింది. దీనితో ఈసారి కూడా గట్టి మాస్ ట్రీట్ ఉంటుంది అని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మేకర్స్ ఈ ఏడాది సెప్టెంబర్ 28న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles