మళ్లీ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తున్న నటి!

Sunday, December 22, 2024

కాంచనమాల కేబుల్‌ టీవీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి లక్ష్మీ రాయ్‌. ఆ తరువాత కాలం కలిసి రాక ఐటమ్స్ సాంగ్స్‌ చేసుకుంటు వచ్చింది. ఆ తరువాత హార్రర్‌ సినిమాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్‌ గా నటించినా కానీ పెద్దగా సక్సెస్‌ కాలేకపోయింది.

దీంతో ఐటమ్ సాంగ్స్‌ లో కుర్ర కారుని తనవైపునకు తిప్పుకుంది.  స్టార్ హీరోల  పక్కన స్టెప్పులు వేసింది. ఈ క్రమంలోనే తెలుగులో మళ్లీ హీరోయిన్‌ గా రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది ఈ భామ. తాజాగా ఆమె కొత్త చిత్రానికి  హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ట్రైలర్ ను లాంచ్ చేశారు. పేరు మార్చుకున్న తరువాత రాయ్‌ లక్ష్మీ హీరోయిన్‌ గా నటిస్తున్న చిత్రం కావడంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా పేరును జనతాబార్‌ గా పెట్టారు. రోచిశ్రీ మూవీస్ పతాకపంపై అశ్వథ్‌ నారాయణ సమర్పణలో రమణ మొగిలి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఆ ట్రైలర్ కొత్తగా ఉంది.. సినిమా పై ఆసక్తిని పెంచుతుంది..

అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. కుస్తీ నేపథ్యంలో తెరకేక్కుతున్న ఈ సినిమాలో స్త్రీ ప్రాధాన్యతను చాటి చెప్పే కథగా రాబోతుంది. సినిమాలో బార్ గర్ల్ గా మొదలైన అమ్మాయి. కుస్తీ పోటిల్లో ఎలా రానిస్తుంది.. సమాజంలో ఆమె ఎలా రానిస్తుంది అనేది చిత్రా కథాంశాంగా డైరెక్టర్‌ చెప్పుకొచ్చారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles