విలక్షణ నటుడిగా మనోజ్ బాజ్‌పేయీకి మంచి పేరు ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో తనకంటూ ఓ మార్క్ ను క్రియేట్ చేసుకున్న మనోజ్ బాజ్‌పేయీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి, అలాగే తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. తన కుటుంబం గురించి మనోజ్ మాట్లాడుతూ.. ‘నేను బీహార్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టాను. ఓ రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను, ఈ రోజు స్థాయిలో ఉండడానికి ఎంతో మొండిగా, ధైర్యంగా ఉండాల్సి వచ్చింది’ అని వివరించాడు.
మనోజ్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. ‘నా కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ‘సత్య’. ఆ సినిమాలో భికూ మాత్రే పాత్ర నాకు జీవితాన్ని ఇచ్చింది. ఆ సినిమా తర్వాత నాకు అవకాశాలు పెరిగాయి. కానీ వచ్చిన అవకాశాలన్నీ విలన్ గానే. అందుకే ఆ మూస ధోరణి విలన్ పాత్రలకి స్వస్తి చెప్పాను.
ఆ సమయంలో అలాంటి విలన్ పాత్రలు చేయడానికి నాకు చాలా పెద్ద మొత్తంలో డబ్బును దర్శకనిర్మాతలు
ఆఫర్ చేశారు .వారితో ఒక్కటే చెప్పా. నేను సినిమా ఇండస్ట్రీలో విలన్‌గా ఉండాలని అనుకోవడం లేదు అని ఓ క్లారిటీ ఇచ్చాను. అప్పుడు ఆ పాత్రలు చేయలేదు కాబట్టే.. ఇప్పుడు నాకంటూ ఓ స్పెషల్ మార్క్ ను క్రియేట్ చేసుకోగలిగాను’ అంటూ మనోజ్ చెప్పుకొచ్చాడు.