మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇపుడు పలు భారీ సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీటికి ముందు తాను చేసిన గ్లోబల్ సెన్సేషనల్ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”తో తాను గ్లోబల్ లెవెల్లో మంచి స్టార్ ఫేమ్ నిసొంతం చేసుకున్నాడు. ఇలా అనేకమంది హాలీవుడ్ నటులు దర్శకులు కూడా తారక్ పై కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
మరి లేటెస్ట్ గా హాలీవుడ్ భారీ హిట్ చిత్రం ‘బ్లాక్ పాంథర్’ నటుడు మైఖేల్ బీ జోర్డాన్ ఎన్టీఆర్ పై తన సిన్నర్స్ ప్రమోషన్స్ లో తారక్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇలా తనకి ఎన్టీఆర్ కి మధ్య ఆ మధ్య ఆస్కార్స్ లో జరిగిన విషయాల గురించి చెప్పుకొచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ ని ఆస్కార్స్ సమయంలో ఓ సారి తారక్ ని కలిశాను.ఆ సమయంలో అతనికి బాస్కెట్ బాల్ ఆడటం అంటే ఎంతో ఇష్టం అని బ్లాక్ పాంథర్ నటుడు చెప్పడం ఇపుడు మంచి ఆసక్తిగా మారింది. దీంతో తన కామెంట్స్ ఇపుడు ఎన్టీఆర్ అభిమానుల్లో వైరల్ అవుతున్నాయి.
