గాయపడినా షూటింగ్‌లోకి వచ్చేస్తున్న నటుడు!

Sunday, December 22, 2024

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్‌లో ‘సికిందర్’ అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రీసెంట్‌గా ప్రారంభించగా, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, హీరో సల్మాన్ ఖాన్‌కి గాయం అయినట్లుగా బాలీవుడ్ వర్గాల్లో ఓ టాక్‌ అయితే నడుస్తుంది.

సల్మాన్‌కి స్వల్ప గాయం అయ్యింది.. అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఆయన షూటింగ్‌లో పాల్గొంటున్నారని బీటౌన్ మీడియా తెలిపింది. తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో సల్మాన్ కాస్త అసౌకర్యంగా ఉన్నట్లు తెలిసిందని చిత్ర బృందం తెలిపింది. అయితే, చింతించాల్సిన అవసరం లేదని.. ఆయన వైద్యుల సూచన మేరకే షూటింగ్‌లో పాల్గొంటున్నాడని సమాచారం.

ఇక ‘సికిందర్’ సినిమాని మురుగదాస్ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుంది ఈ సినిమాను వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles