అందుకే పాండ్యా-నటాషా విడిపోయారా!

Wednesday, January 22, 2025

హార్దిక్‌ పాండ్యా-నటాషా ఈ ఏడాది జులైలో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ఎందుకు విడిపోయింది..అనే విషయం మాత్రం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు కూడా ఇటీవల పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఈ విషయాన్ని ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. గత ఏడాది కాలంగా ఈ స్టార్ కపుల్ మధ్య మనస్పర్ధలు ఉన్నాయని రూమార్లు వినిపిస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు, ఈ జంట ఎందుకు విడిపోయారో మొదటిసారి కుటుంబ సభ్యుడు ఒకరు వెల్లడించారు.

నటాషా ఇష్టం వచ్చినట్లు ఉండటాన్ని హార్దిక్ పాండ్యా తట్టుకోలేకపోయాడని సమాచారం. నటాషా తనకు ఇష్టం వచ్చినట్లుగానే ఉండాలని కోరుకున్నారు. ఈ అంశం పాండ్యా-నటాషాల పెళ్లిలో చిచ్చు రేపింది. హార్దిక్ ప్రవర్తనతో కుటుంబానికి సన్నిహితంగా ఉండే మరో వ్యక్తి వలన నటాషా కూడా విసిగిపోయిందని  సమాచారం.

ఇద్దరికీ మేలు జరగాలంటే విడిపోవడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నిజానికి హార్దిక్ పాండ్యా దూకుడు వ్యక్తిత్వం కలవాడు. అతనితో జీవించడం బోరింగ్‌గా మారడంతో పాండ్యాతో నటాషా కొనసాగలేకపోయిందని, అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు నేషనల్ మీడియా పోర్టల్ ఒకటి వివరించింది. నటాషా హార్దిక్ పాండ్యా ప్రవర్తనను మెరుగుపరుచుకోవడానికి చాలాసార్లు చర్చించింది. కానీ అతను మారకపోవడంతో విడాకులు ప్రకటించారని తెలుస్తోంది.

ఇక నటాషా సన్నిహితురాలు మాట్లాడుతూ, ఇది కఠినమైనది అయినప్పటికీ, అతను అనివార్యంగా విడాకులు తీసుకున్నారని చెప్పుకొచ్చింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles