రామ్ చరణ్ హీరోగా, బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ పెద్ది పై అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనుండటంతో అంచనాలు మరింతగా పెరిగాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. మలయాళ నటి స్వాసిక ఈ సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకున్నట్లు తెలిపారు. కారణం మాత్రం తల్లి పాత్ర కావడమేనని ఆమె చెప్పింది. ప్రస్తుతం తన వయసుకు ఇలాంటి పాత్ర సరిపడదని, భవిష్యత్తులో అయితే ఇలాంటి రోల్స్ ఆలోచించవచ్చని స్పష్టం చేసింది.
మరోవైపు రామ్ చరణ్ ఈ సినిమాలో పూర్తిగా రగ్డ్ లుక్‌లో కనిపించబోతున్నాడు. హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గ్రామీణ వాతావరణంలో క్రికెట్ నేపథ్యంలో కథ సాగుతుందనే వార్తలు ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారాయి. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో మ్యూజిక్‌పైనా మంచి హైప్ క్రియేట్ అయింది.
