అందుకే పెళ్లి విషయాన్ని సీక్రెట్‌ గా ఉంచాను!

Sunday, December 22, 2024

సొట్ట బుగ్గల సుందరి తాప్సీ కొద్ది రోజుల క్రితం సీక్రెట్‌ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లి  కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య తన ప్రేమికుడు మథియాస్‌ బోన్‌  వివాహం చేసుకున్నారు. మార్చి 20న తాప్సీ, మథియాస్‌ ప్రీవెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా జరగగా.. ఉదయ్‌పూర్ లో మార్చి 23న వివాహం చేసుకున్నారు.

తాప్సీ తన పెళ్లి విషయం గురించి చాలా సీక్రెట్‌ గా ఉంచింది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం పెళ్లికి సంబంధించిన వీడియోలు లీక్ అయ్యాయి.  తాజాగా పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచడానికి గల కారణాన్ని తాప్సీ ఓ  మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ… ‘నా వ్యక్తిగత జీవితాన్ని వీలైనంత వరకు సీక్రెట్‌ గానే ఉంచాలనుకున్నా. నా పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలను బయటకు చెప్పి.. అందరిలో ఆసక్తి పెంచాలనుకోలేదు. అందుకే పెళ్లి విషయాన్ని సీక్రెట్‌ గా ఉంచా. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే.

ఈ విషయంలో నా భర్తకు, నా పేరెంట్స్ వేరే ఏదైనా అభిప్రాయం ఉండొచ్చు. అందుకే పెళ్లి విషయం మీడియాలో కానీ, సోషల్‌ మీడియాలో కానీ మేము చెప్పలేదు’ అని అన్నారు. ‘పెళ్లి చేసుకున్న విషయాన్ని రహస్యంగా ఉంచాలనే ఉద్దేశం కాదు. నా సన్నిహితులు, కుటుంబసభ్యులు మొదటి నుంచి పెళ్లిలో ఉన్నారు

. వాళ్లకు అన్నీ తెలుసు. కుటుంబసభ్యుల అంగీకారంతోనే మేం వివాహం చేసుకున్నాం. పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి జరుగుతుంది. ఆనందంగా చేసుకోవాలనుకున్నా. అందుకే ఆర్భాటాలకు చోటివ్వకుండా.. కొందరి సమక్షంలో ఒక్కటయ్యాం. నా పెళ్లి ఫొటోలు, వీడియోలను పంచుకోవడానికి ఇప్పుడే సిద్ధంగా లేను. నాకు షేర్‌ చేయాలనిపించినపుడు చేస్తా’ అని తాప్సీ తెలిపారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles