అందుకే తెలుగు ఎక్కువ మాట్లాడను!

Saturday, January 18, 2025

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించిన కాజల్ తన సినీ కెరీర్ ఫుల్ పీక్స్ లో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ ని పెళ్లి చేసుకుంది. సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన తరువాత గతేడాది బాలయ్య సరసన హీరోయిన్ గా నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమా మంచి విజయం అందుకుంది.

ప్రస్తుతం కాజల్ “సత్యభామ”అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా లో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో నవీన్ చంద్ర హీరోగా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రీలీజ్ చేసిన పోస్టర్స్ ,టీజర్ ,సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రం ట్రైలర్ ను మే 24 రాత్రి 8 .01 గంటలకు స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ విడుదల చేయనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కాజల్ తన ట్విటర్  ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.

ఆ వీడియోలో ఫ్యాన్స్ మీరు తెలుగు మాట్లాడండి మేడం వినాలని ఉంది అని కామెంట్ చేయగా…నాకు తెలుగు బాగా వచ్చు కానీ తెలుగులో మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేది తప్పో ,ఒప్పో తెలీదు. అందుకే ఎక్కువగా తెలుగులో మాట్లాడను. మీకోసం సత్యభామ ప్రీ రీలీజ్ ఈవెంట్ లో నేను తెలుగులో మాట్లాడుతా అని కాజల్ పేర్కొంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles