పవన్ కళ్యాణ్ తాజా చిత్రం “OG” బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. మొదటి వీకెండ్‌కే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.255 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. యాక్షన్ డ్రామా జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు సుజీత్ మాస్ టచ్‌తో రూపొందించారు. ఇందులో పవన్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో కనిపించడం అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.
అయితే ఇందులో పవన్ చిన్న వయసు పాత్రను ఆయన కుమారుడు అఖీరా నందన్ ఎందుకు చేయలేదన్న సందేహం చాలామందికి వచ్చింది. దీనిపై ఆ రోల్ చేసిన ఆకాష్ శ్రీనివాస్ స్పందించాడు. అఖీరా నందన్‌తో పోలిస్తే తన హైట్ ఎక్కువగా సరిపోతుందని, అలా చేయకపోతే సీన్లలో కంటిన్యువిటీ సమస్యలు వచ్చేవని ఆయన చెప్పాడు. అందుకే డైరెక్టర్ సుజీత్ తనను ఎంచుకున్నారని వివరించాడు.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన విలన్‌గా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. అలాగే ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి వంటి కీలక నటులు కూడా కనిపించారు. థమన్ సంగీతం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది.
