మొదలయ్యేది అప్పుడే!

Saturday, December 21, 2024

టాలీవుడ్‌లో కమెడియన్ నుండి దర్శకుడిగా మారిన వేణు యెల్దండి ‘బలగం’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. పూర్తి ఎమోషనల్ కంటెంట్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో బాగా సక్సెస్ అయ్యింది. ఇక వేణుతో సినిమా చేసేందుకు పలువురు హీరోలు ఆసక్తిని చూపిస్తున్నారు.

ఈ క్రమంలో వేణు యెల్దండి తన నెక్స్ట్ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో చేయనున్నట్లు గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు ‘యెల్లమ్మ’ అనే టైటిల్‌ని కూడా ఫిక్స్ చేశారు మూవీ మేకర్స్. ఈ చిత్రాన్ని వేణు ఎవరితో చేయబోతున్నాడా అనే విషయంపై పలు వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి.

కాగా, తాజాగా జరిగిన ఓ మూవీ ఈవెంట్‌లో నిర్మాత దిల్ రాజు ‘యెల్లమ్మ’ మూవీపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వేణు యెల్దండి నెక్స్ట్ మూవీ యెల్లమ్మ తమ బ్యానర్లోనే రానుందని.. త్వరలోనే ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రకటిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

అంతేగాక, యెల్లమ్మ మూవీని వచ్చే ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టబోతున్నట్లు దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమాకు యెల్లమ్మ అనే టైటిల్ మాత్రం కన్ఫమ్ అని ఆయన ఈ సందర్భంగా కామెంట్ చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles