బాలయ్య బాబు కోసం అదిరే మాస్‌ సాంగ్‌!

Sunday, December 22, 2024

నందమూరి నట సింహం బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమాకి గురించి  తమన్ మాట్లాడుతూ.. ‘ఎన్బీకే 109 మూవీ రష్ చూశాను. బాలయ్య అభిమానులకు ఈ సినిమా పెద్ద పండగే’ అంటూ చెప్పడంతో ఆ విషయం కాస్తా  వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఐతే, అదే ఊపుతో తమన్ ఈ సినిమా కోసం ఓ అదిరిపోయే మాస్ సాంగ్ ను అభిమానుల ముందుకు తీసుకుని వచ్చేందుకు రెడీ అవుతున్నారంట. బాలయ్య పాత్ర గ్రాఫ్ పై సాగే ఈ సాంగ్ చాలా బాగా వచ్చిందని.. వచ్చే షెడ్యూల్ లో ఈ క్రేజీ సాంగ్ ను షూట్ మొదలు పెడతారని సమాచారం.

మొత్తమ్మీద ఈ సినిమా మాత్రం కచ్చితంగా బాలయ్య ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చేలా డైరెక్టర్‌  బాబీ ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు మాత్రం రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో బాలయ్య పాత్ర నెవ్వర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందని సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles