సరిపోదా శనివారం నుంచి అదిరే అప్డేట్‌!

Wednesday, January 22, 2025

ఏ ఏడాదికి ఆ ఏడాదే నాని వరుస హిట్లను అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. గతేడాది కూడా రెండు వరుస హిట్లను అందుకున్న నేచురల్‌ స్టార్‌ నాని ..ఈ ఏడాది తాజాగా నటిస్తున్న మూడో సినిమా సరిపోదా శనివారం. ఈ సినిమా దర్శకుడు వివేక్‌ ఆత్రేయ. ఈ సాలిడ్‌ అకేషన్‌ డ్రామాలో ప్రియాంక అరుళ్ మోహన్‌ హీరోయిన్‌ గా చేస్తుండగా..దర్శకుడు, నటుడు ఎస్‌జే సూర్య విలన్‌ గా నటిస్తున్నాడు.

 అయితే ఈ సినిమా నుంచి తాజాగా వరుస అప్డేట్స్ వస్తున్నా సంగతి తెలిసిందే. మరి అలా ఇప్పుడు కూడా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని చిత్ర బృందం విడుదల చేసింది. మరి దీంతో మేకర్స్ ఉల్లాసం సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసారు. ఇందులో నాని, ప్రియాంక మోహన్ ల నడుమ మంచి సీన్స్ కనిపిస్తుండగా జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అదిరిపోయే బీట్స్ ని అందించాడు.

ఇక దీంతో ఈ సాంగ్ ఈ సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకి విడుదల చేస్తున్నట్టుగా ఫిక్స్ చేశారు. మరి ఈ ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ ఈ ఆగస్ట్ 29న సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles