అది పేరు కాదు..ఓ బ్రాండ్‌!

Thursday, January 9, 2025

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా అయిపోయాడు. ఆయన నటించిన ‘పుష్ప-2’ వచ్చేవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాతో డైరెక్టర్‌ సుకుమార్, బన్నీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను ప్రస్తుతం శరవేగంగా జరుపుతున్నారు.

ఈ క్రమంలో కేరళలో ఈ చిత్ర ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక కేరళలో పుష్ప క్రేజ్ చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత బన్నీ వాస్, అల్లు అర్జున్ సిగ్నేచర్ మార్క్ AA ని ఉంగరం రూపంలో తన చేతికి పెట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అల్లు అర్జున్ అనేది పేరు కాదని… ఓ బ్రాండ్ అనే అర్థం వచ్చేలా ఈ ఫోటోకు ఆయన క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ చూసిన అభిమానులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles