సౌత్ ఫిలింలో శ్రుతి హాసన్‌కు ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. సినిమాల ఎంపికలో తనదైన స్టైల్ ఫాలో అవుతూ, కొత్తకొత్త పాత్రలతో ముందుకెళ్తోంది. ఇటీవల ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడంతో, ఆమెకు మళ్లీ మంచి బజ్ వచ్చింది.
ప్రస్తుతం శ్రుతి, రజినీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కూలీ’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తనకు ఎప్పటి నుంచో ఓ స్పెషల్ రోల్ చేయాలనే కోరిక ఉందని చెప్పింది.
తాను మ్యూజిక్‌ను బాగా ఇష్టపడతాననీ, దాన్ని ఆధారంగా చేసుకుని ఓ సంగీత దర్శకురాలి పాత్రలో నటించాలని ఎప్పటి నుంచో కలగంటున్నానని తెలిపింది. తెరపై అలా ఓ మ్యుజిషియన్ క్యారెక్టర్‌లో కనిపించాలన్నదే తన డ్రీమ్ అని చెప్పింది.
ఇప్పటివరకు చేసిన రోల్స్ కంటే భిన్నంగా ఉండే అలాంటి పాత్ర దక్కితే, తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించగలదని ఆమె భావిస్తోంది. మరి శ్రుతి కల ఎప్పటికి నిజం అవుతుందో చూడాలి.
