అంతే..అంతే..మీకు వినపడుతుందా!

Wednesday, January 22, 2025

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తీరిక లేకుండా  సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు.  ఈ లైనప్ లో భారీ అంచనాలు ఉన్న మూవీ స్పిరిట్‌ కూడా ఒకటి. ఈ మూవీ సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌ లో ఓ పవర్‌ ఫుల్‌ కాప్‌ స్టోరీగా రాబోతుంది. . ప్రస్తుతం ‘స్పిరిట్’ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ తో కలిసి సందీప్ రెడ్డి వంగా జర్నీ కూడా చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ కూడా అవుతున్నాయి. సినిమాలో సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో హర్షవర్ధన్ రామేశ్వర్ షూటింగ్ కి ముందు నుంచే దర్శకుడితో ట్రావెల్ అవుతున్నాడు.

ఐతే, ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని.. కాకపోతే మొదటి రెండు షెడ్యూల్స్ లో ప్రభాస్ జాయిన్ కాడు అని, మార్చిలో మొదలయ్యే మూడో షెడ్యూల్ నుంచి ప్రభాస్ షూట్ లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని టి-సిరీస్,  భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘స్పిరిట్‌’ మెయిన్ కథాంశమే చాలా వినూత్నంగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రానుందని సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles