పవన్ కళ్యాణ్ నటిస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాపై ఆసక్తి ఎంతగా ఉందో తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పవన్ అభిమానులు సినీ ప్రేమికుల్లోనూ మంచి బజ్ క్రియేట్ చేసింది. టీవలే ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది.
ఇప్పటికే పెద్ద భాగం షూటింగ్ పూర్తవగా, పవన్ కళ్యాణ్‌పై మిగిలిన సీన్స్‌ను మరో వారం రోజుల్లో షూట్ చేయనున్నట్లు నిర్మాత నవీన్ తెలిపారు. అదే సమయంలో ఇతర నటీనటులతో కలిసి చేసే పార్ట్‌ను సుమారు 25 రోజుల్లో ముగించనున్నారట. అంటే సినిమా షూటింగ్ దాదాపు క్లైమాక్స్‌కు చేరింది అని చెప్పొచ్చు.
ఇంకా రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదన్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. మొత్తం మీద అభిమానులు ఎదురు చూస్తున్న ఈ చిత్రం తక్కువ రోజుల్లోనే పూర్తవుతున్నందుకు సంతోషించాల్సిందే.
