అంతే తీసుకుందా!

Wednesday, January 22, 2025

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ సినిమా‘పుష్ప-2’ ప్రేక్షకుల ముందుకు రావడానికి   మరో నెల రోజులు మాత్రమే ఉంది. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ మరోసారి బాక్సాఫీస్ భరతం పట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో యంగ్ బ్యూటీ శ్రీలీల చిందులు వేయనుండటంతో ఈ సాంగ్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే, ఈ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్ చేస్తున్నందుకు ఆమెకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారా అనే టాక్ సినీ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తుంది. ఈ సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ కోసం కేవలం రూ.2 కోట్ల మేర రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటుందని తెలుస్తోంది. గతంలో ‘పుష్ప’ చిత్రంలో సమంత ‘ఊ అంటావా’ సాంగ్‌కా ఏకంగా రూ.5 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుందట.

దీంతో శ్రీలీల ‘పుష్ప-2’ సాంగ్‌కి తక్కువగానే తీసుకుంటుందని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా, ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ సినిమాని సమర్పిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles