ఊర మాస్‌ స్టెప్పులు అంతే!

Friday, December 27, 2024

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా,  క్రియేటివ్ టాలెంటెడ్‌ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌ లో  రాబోతున్న ‘పుష్ప 2 ది రూల్’ సినిమా నుంచి కిస్సిక్‌ పాట బయటకు వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఈ పాట లిరికల్‌ వీడియో ప్రస్తుతం విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా లిరిక్స్ తో పాటు శ్రీలీల – బన్నీ స్టెప్స్ సూపర్‌ గా ఉన్నాయి.

అటు బన్నీ – శ్రీలీల కెమిస్ట్రీ కూడా సూపర్‌ ఉంది. అయితే, చెన్నై వేదికగా నిర్వహించిన పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో.. దేవిశ్రీ ప్రసాద్‌, వచ్చే వారం రాబోతున్న మరో పాట గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఇంతకీ, దేవిశ్రీ ప్రసాద్‌ ఏం మాట్లాడారు అంటే.. ‘నేను ‘పుష్ప 2’ చిత్రం ఫస్టాఫ్‌ చూసినప్పుడే ఫిదా అయ్యాను. ద్వితీయార్ధం చూశాక మతిపోయింది. నిజంగా అల్లు అర్జున్‌ తన నట విశ్వరూపం చూపించాడు. ముఖ్యంగా వచ్చే వారం మరో పాట వస్తుంది. ఆ పాటలో బన్నీ ఊరమాస్‌ స్టెప్పులు చూస్తారు’ అంటూ దేవిశ్రీ చెప్పుకొచ్చాడు.

మరి ఆ పాట ఎలా ఉంటుందో.. నిజంగానే బన్నీ ఊరమాస్‌ స్టెప్పులు ఎలా ఉంటాయో చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక  హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ పాన్ ఇండియన్ రేంజ్ లో ఎంతో గ్రాండ్ గా తీర్చిదిద్దుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles