పవన్ కళ్యాణ్ సినిమాల హంగామా మళ్లీ మొదలవుతోంది. భారీ అంచనాలతో రూపొందుతున్న “హరిహర వీరమల్లు” థియేటర్లలోకి రానుండగా, మరోవైపు “ఉస్తాద్ భగత్ సింగ్” షూటింగ్ కూడా చివరి దశలోకి వచ్చేసింది. ఈ సినిమాలో శ్రీలీలతో పాటు మరో హీరోయిన్ కూడా నటిస్తున్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఆ విషయం అధికారికంగా బయటకు వచ్చింది.
రాశీ ఖన్నా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించనున్నట్టు చిత్రబృందం స్పష్టంగా చెప్పేసింది. ఆమె పాత్ర పేరే ‘శ్లోక’ కాగా, ఫొటోగ్రాఫర్‌గా కనిపించబోతున్నది. తాజాగా ఆమె లుక్‌ను పోస్టర్ రూపంలో రిలీజ్ చేసి ఆ విషయం క్లారిటీ ఇచ్చారు. ఇందులో రాశీ ఖన్నా స్టైలిష్ గెటప్‌లో ఫోటో తీస్తున్న సందర్భంలో కనిపిస్తుంది. దీంతో సినిమాపై అభిమానుల్లో కొత్తగా ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తికావడానికి చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు కథానాయిక రాశీ ఖన్నా జాయినింగ్‌తో సినిమాకు మరో ఆకర్షణ కలిగింది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాల చుట్టూ హైప్ పెరగడంతో ఫ్యాన్స్ కోసం ఇది ఒక స్పెషల్ మూవీ సీజన్ అనే చెప్పాలి.
