వెయింటింగ్‌ అంతే!

Friday, April 4, 2025

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న అవైటెడ్ భారీ చిత్రమే “విశ్వంభర”. అయితే చాలా కాలం తర్వాత చిరు నుంచి వస్తున్న స్ట్రైట్ సినిమా కం భారీ విజువల్ ట్రీట్ చిత్రం ఇదే కావడంతో మొదటి నుంచి మంచి బజ్ ఈ చిత్రంపై ఉంది. అయితే ఎప్పుడో జనవరిలో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఇంకా రాలేదు. మధ్యలో చిరుపై కొన్ని స్టిల్స్ వచ్చి సోషల్ మీడియాలో సందడి చేసాయి.

కానీ ఇక మరే ఇతర అప్డేట్ రాలేదు. దీనితో ఇపుడు ఫ్యాన్స్ కొంచెం డిజప్పాయింట్ గా ఉన్నారు. ఇపుడు రామ నవమి రాబోతుండగా కనీసం ఈ పండుగ సందర్భ అప్డేట్ కోసం అయినా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనితో మెయిన్ గా ఓ అప్డేట్ సహా సినిమా రిలీజ్ పై మాత్రం ఓ క్లారిటీ ఏమన్నా తాము కోరుకుంటున్నారు. మరి ఆ స్పెషల్ డే కి మేకర్స్ ఏమన్నా ప్లాన్ చేసారో లేదో వేచి చూడాలి. ఇక ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles