సాలిడ్‌ కాంబో అంతే!

Saturday, January 18, 2025

యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ చిత్రం “మెకానిక్ రాకీ” . అయితే ఈ చిత్రం మంచి టాక్ ని తెచుకున్నప్పటికీ ఆశించిన వసూళ్లు అందుకోలేదు. ఇక ఈ సినిమా తర్వాత తన నుంచి రానున్న చిత్రాల్లో డైరెక్టర్‌  “జాతి రత్నాలు” ఫేమ్ అనుదీప్ కేవీతో ఓ సినిమా కూడా ఉండనున్నట్లు టాక్‌ నడుస్తుంది. అయితే మాస్ కా దాస్ తో ఇపుడు ఫైనల్ గా అఫీషియల్ అప్డేట్ విడుదల చేశారు.

వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ తో ఈ సినిమాని ప్రకటించారు. మరి ఈ చిత్రాన్ని “ఫంకీ” అంటూ ఒక సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రకటించారు. కల్కి 2898 ఏడీ డైరెక్టర్‌ నాగ్ అశ్విన్ క్లాప్ తో నేడు సినిమా స్టార్ట్‌ అయ్యింది. అలాగే విశ్వక్ తో ఆల్రెడీ సితార వారు “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమా విషయం తెలిసిందే. ఇది మరో సినిమా అని చెప్పాలి.

మరి ‘ప్రిన్స్” తర్వాత అనుదీప్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. దీంతో తన నుంచి కూడా సినిమా రావాలని చాలా మంది అనుకుంటున్నారు. మరి ఈ ఫంకీ ఎలాంటి నవ్వులు పూయిస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రం సంక్రాంతి తర్వాత నుంచి షూటింగ్ మొదలుకానుందని తెలుస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles