ఆ విషయం బాధ పెట్టింది!

Wednesday, January 22, 2025

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుని కలుపుతున్నారని వార్తలు గత నాలుగు రోజులుగా యావత్‌ దేశాన్ని ఓ ఊపు ఉపుతున్నాయి. ఈ నేపథ్యంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగడం తనను ఎంతో బాధించింది అంటూ యంగ్‌ హీరో మంచు మనోజ్‌ ఎమోషనల్ అయ్యారు.

ఇంతకీ, మనోజ్ తన పోస్ట్ లో ఏం పెట్టారంటే.. ‘లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తూ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వును వాడారని తెలిసి ఎంతో కలత చెందాను. ఇది కేవలం తప్పు మాత్రమే కాదు. భక్తుల మనోభావాలను అగౌరవపరచడం కూడా.

ఈ తరుణంలో అన్ని పార్టీలు ఏక తాటి పైకి రావాలి. బాధ్యులను గుర్తించాలి. వారిపై తగిన చర్యలు తీసుకోవాలి. సంస్కృతి, మతపరమైన విలువలను గౌరవించాలి. సంప్రదాయాలను ఉల్లంఘిస్తే సహించబోమనడానికి ఇదొక ఉదాహరణ కావాలి’’ అని మనోజ్‌ రాసుకొచ్చారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles