ఆ తమిళ హీరో కన్నడ నటుడ్ని పొగిడాడు!

Saturday, January 10, 2026

తమిళ హీరో శివ కార్తికేయన్ ‘కేజీఎఫ్’ హీరో యశ్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కన్నడ సినిమా సక్సెస్ వెనుక యశ్ ఉన్నారు అంటూ శివ కార్తికేయన్ చెప్పుకొచ్చారు. శివ కార్తికేయన్ అసలు ఏం అన్నారంటే. ‘కేజీఎఫ్’ యశ్ కారణంగా కన్నడ సినిమాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది అని గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో కొనియాడారు.

శివకార్తికేయన్ ఇంకా మాట్లాడుతూ.. ‘కన్నడ సినిమా పరిశ్రమలో నాకు మొదట తెలిసిన పర్సన్‌  శివ రాజ్‌కుమార్. ఆయన చాలా స్నేహశీలి, మృధుస్వభావి. ఆయన అంటే నాకు ఇష్టం. అయితే, కన్నడ పరిశ్రమకు యశ్ చేసిన మంచి కూడా అంతా ఇంతా కాదు. కేజీఎఫ్-1 వచ్చినప్పుడు ఆ పరిశ్రమ సక్సెస్ అయింది. కానీ కేజీఎఫ్-2తో భారత సినిమా విజయవంతం అయ్యింది’ అని శివకార్తికేయన్ పొగిడారు. ఇక శివ కార్తికేయన్ నటించిన బయోపిక్ ‘అమరన్’ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమా మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కింది. రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. మొత్తానికి శివ కార్తికేయన్ ఈ సినిమాతో 250 కోట్ల క్లబ్‌లో కూడా చేరిపోయాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles