ప్రస్తుతం ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న “డ్రాగన్” సినిమాపై విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్సైనప్పటి నుంచే ఫ్యాన్స్ లోను, ట్రేడ్ సర్కిల్స్ లోను భారీ అంచనాలే కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ఇంటర్వెల్ ఎపిసోడ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సమాచారం ప్రకారం, డ్రాగన్ మూవీ ఇంటర్వెల్ బ్లాక్ చాలా పవర్‌ఫుల్ గా ఉండబోతుందట. యాక్షన్‌తో పాటు మార్షల్ ఆర్ట్స్ స్టైల్‌లో ఈ సీన్ ఉండబోతుందని టాక్. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సీక్వెన్స్ ఏకంగా ఎన్టీఆర్ కెరీర్‌లోనే బెస్ట్ ఇంటర్వెల్ సీన్ గా నిలవనుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. అదే నిజం అయితే ఈ సినిమా, ఫ్యాన్స్ హృదయాల్లో చిరస్థాయిగా ముద్ర పడటం ఖాయం.
ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు విశేషమైన ప్రాధాన్యత ఇస్తున్నాడట. స్క్రిప్ట్ విషయంలో ఏ మాత్రం కంపర్‌మైజ్ కాకుండా, చాలా కాలం పాటు కసరత్తు చేశాడని తెలుస్తోంది. ఆయన గత సినిమాల దృష్ట్యా, ఈసారి మరింత ఎమోషన్, యాక్షన్ మిక్స్ తో ఒక మ్యాజికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాడు. అందుకే ఇది ప్రశాంత్ నీల్ కెరీర్‌లో కూడా టాప్ ప్రాజెక్ట్‌గా నిలవొచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ భారీ ప్రాజెక్ట్‌కి మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా భాగస్వాములుగా వ్యవహరిస్తుండటం విశేషం. మ్యూజిక్ డిపార్ట్‌మెంట్‌లో రవి బస్రూర్ మళ్లీ తన మాయ జల్లించబోతున్నాడు. మొత్తానికి, “డ్రాగన్” సినిమా ఏ ఒక్కరినైనా ఆకట్టుకునేలా పర్ఫెక్ట్ ప్యాకేజీగా రూపుదిద్దుకుంటోంది.
