బాలయ్య సినిమాలో ఆ సీనియర్‌ హీరోయిన్‌!

Sunday, December 22, 2024

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం యంగ్‌ డైరెక్టర్‌ బాబీ కాంబోలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా “NBK109 ” అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను మేకర్స్ దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత బాలయ్య తన ఫేవరేట్ డైరెక్టర్ అయిన బోయపాటి డైరెక్షన్ లో అఖండ 2 సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. వీరి కాంబోలో గతంలో వచ్చిన అఖండ మూవీ భారీ విజయం సాధించింది. ఇప్పుడు తాజాగా అఖండ సినిమాకు మేకర్స్ సీక్వెల్ తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పటికే కథ సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని మేకర్స్‌ ప్రయత్నిస్తున్నారు.

అఖండ 2 సినిమా కొత్త కథతో తెరకెక్కనుందని ఇప్పటికే టాక్‌. అయితే అఖండ 2 లో కొత్త హీరోయిన్ ను తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే అఖండ 2 లో సీనియర్ హీరోయిన్ భూమిక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles