ఆ న్యూస్ ఏంటంటే…!

Tuesday, January 21, 2025

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, హీరోయిన్ సాయి పల్లవి సీతగా బాలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ నితేష్ తివారీ రామాయణ్ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. రావణుడిగా కన్నడ స్టార్ హీరో యష్ యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో సన్నీ డియోల్, రకుల్, లారా దత్తా వంటి ప్రముఖ నటీనటులు కూడా ఈ మూవీలో యాక్ట్‌ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైన కొద్దిరోజుల్లోనే ఫోటోస్ బయటకు వచ్చేశాయి. దీంతో, మేకర్స్ ప్రస్తుతం ముంబైలో ఇండోర్ షూటింగ్ మొదలు పెట్టారు.

ఐతే, ఈ నెల నాలుగో వారం నుంచి జరగబోయే కొత్త షెడ్యూల్ లో సాయి పల్లవి పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఈ సన్నివేశాలు సినిమాలోనే  ముఖ్యం అని, అంతేకాకుండా సాయి పల్లవి నటనను ఎలివేట్ చేసే ఈ సీన్స్ తో ఆమె నటన స్థాయి మరో మెట్టుకు పెరుగుతుందని తెలుస్తోంది. అన్నట్టు కన్నడ స్టార్ హీరో యష్ ఈ మూవీ ప్రొడక్షన్ లో కూడా భాగమయ్యారు. ఆయన సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పవిత్ర ఇతిహాసం రామాయణం ఆధారంగా రాబోతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles