ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రెండు భారీ సినిమాలు ఒకే సమయంలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వార్ 2’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందో అని సినీ ప్రపంచం అంతా వెయిట్ చేస్తోంది.
ఇదే సమయంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘కూలీ’ కూడా ఆగస్టు 14న భారీ స్థాయిలో థియేటర్లలోకి రానుంది. అయితే ఈ రెండు పాన్ ఇండియా సినిమాల మధ్య అనుకోని పరిస్థితి నెలకొంది. బెంగాల్ మార్కెట్‌లో వీటికి పెద్దగా క్రేజ్ లేకుండా, అక్కడ విడుదలవుతున్న ఓ చిన్న సినిమా టికెట్ బుకింగ్స్‌లో ముందంజలో ఉంది. ‘ధూమ్ కేతు’ అనే ఆ సినిమా అక్కడి ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటూ, బుకింగ్స్‌లో పెద్ద సినిమాలను వెనక్కి నెట్టేస్తోంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమా దాదాపు పది సంవత్సరాల క్రితం షూటింగ్ ప్రారంభమై, 2017లో పూర్తి అయింది. కానీ వేరే వివిధ కారణాల వల్ల ఇంతకాలం విడుదల కాలేదు. ఇప్పుడు మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. మరి ఈ ధూమ్ కేతు, ‘వార్ 2’ మరియు ‘కూలీ’ సినిమాలకు ఎంతమేర పోటీ ఇస్తుందో వేచి చూడాల్సిందే.
