స్పిరిట్‌ కంటే ముందు ఆ సినిమానే!

Tuesday, January 21, 2025

యంగ్‌ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన లేటెస్ట్ సెన్సేష‌న‌ల్ సినిమా ‘క‌ల్కి 2898 AD’ వ‌ర‌ల్డ్ వైడ్ గా ఎంతటి ప్ర‌భంజ‌నం సృష్టించిందో తెలిసిందే. యంగ్‌ టాలెంటెడ్‌ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన ఈ సైఫై మూవీకి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వసూళ్లను రాబట్టాడు ప్రభాస్‌. అయితే, ప్ర‌భాస్ నెక్ట్స్ చిత్రాల‌పై అప్పుడే సినీ వర్గాల్లో జోరుగా చ‌ర్చ సాగుతోంది.

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ ‘స్పిరిట్’ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు హ‌ను రాఘ‌వ‌పూడి డైరెక్ష‌న్ లో ‘ఫౌజీ’ అనే సినిమాలోనూ ప్రభాస్ యాక్ట్‌ చేస్తున్నాడు. అయితే, ప్ర‌భాస్ తొలుత ‘స్పిరిట్’ సినిమానే స్టార్ట్ చేస్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఆ సినిమా ప్రీ-ప్రొడక్ష‌న్ ప‌నుల‌కు మ‌రింత స‌మ‌యం ప‌డుతుండ‌టంతో, ప్ర‌భాస్ హను రాఘ‌వ‌పూడితో సినిమాను ప్రారంభించాల‌ని అనుకుంటున్నాడని టాక్‌.

ఈ సినిమా షూటింగ్ అక్టోబ‌ర్ లో మొదలు పెట్టేందుకు సినిమా బృందం రెడీ అవుతోంది. స్పిరిట్ చిత్ర షూటింగ్ ను 2025 మొదటి ఆరు నెలల్లో ప్రారంభించాల‌ని ప్ర‌భాస్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఫౌజీ సినిమా 1940ల నేప‌థ్యంలో సాగే క‌థ‌గా రాబోతుంద‌ని.. ఈ సినిమాలో అందాల భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టించ‌నుంద‌ని సమాచారం. మ‌రి నిజంగానే ప్ర‌భాస్ ఫౌజీ సినిమాకు ఎక్కువ ఫ్రిఫరెన్స్‌ ఇస్తున్నాడా.. నిజంగానే స్పిరిట్ సినిమాను వ‌చ్చే ఏడాది ప్రారంభిస్తాడా..? అనే విష‌యాల‌పై క్లారిటీ రావాల్సి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles