ఆ క్షణం..నా గుండెను నా చేతిలో పెట్టినట్లుంది!

Monday, September 16, 2024

బాలీవుడ్‌ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరికి ఓ ముద్దుల కూతురు రాహా కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రణ్‌బీర్‌  తన కుమార్తె రాహా పుట్టాక తన జీవితం పూర్తిగా మారిపోయిందంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.ఈ సందర్భంగా రణ్‌బీర్‌ కపూర్‌ మాట్లాడుతూ.. ‘రాహా పుట్టినప్పుడు నేను అనుభవించిన ఆనందం నాకు ఎప్పటికీ స్పెషలే. ఆ సంతోషం నాకింకా గుర్తుంది. నా కూతురు పుట్టకముందు నేను ఒకలా ఉన్నాను. రాహా పుట్టిన తరువాత నాలో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం కొత్త భావోద్వేగాలను, కొత్త ఆలోచనలను అనుభవిస్తున్నాను’ అంటూ రణ్‌బీర్‌ చెప్పుకొచ్చాడు.

రణ్‌బీర్‌ ఇంకా మాట్లాడుతూ.. ‘ఓ విషయాన్ని మాత్రం నేను చాలా క్లియర్‌ గా  చెప్పగలను. రాహా పుట్టక ముందు వరకు  నాకు చావు గురించి, ఆరోగ్యం గురించి అసలు భయం ఉండేది కాదు. కానీ, ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నా. గతంలో సిగరెట్‌ తాగేవాడిని. తండ్రి అయ్యాక వెంటనే మానేశాను. రాహాను నా చేతుల్లోకి తీసుకున్న క్షణం… నా గుండెను తీసుకొచ్చి నా చేతిలోనే పెట్టిన ఫీలింగ్ కలిగింది’ అంటూ రణ్‌బీర్‌  ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles