పుష్ప 2 కోసం ఆ ముద్దుగుమ్మ!

Sunday, January 26, 2025

పుష్ప2 సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ సినిమాలోని ఐటెం సాంగ్‌ గురించి పెద్ద చర్చే నడుస్తుంది. కానీ ఇప్పటికీ ఆ ఐటెం సాంగ్‌ లో నటించే బ్యూటీ ఎవరూ అనేది మాత్రం తేలడం లేదు. ఇప్పటికే ఈ పాట గురించి చాలామంది ముద్దుగుమ్మల పేర్లు వినిపించగా.. ఫైనల్‌గా ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దగ్గర ఆగినట్టుగా సమాచారం. గతంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ దాదాపు ఓకే అయ్యిందనే వార్తలు వినిపించాయి.

యానిమల్ సినిమా చూసిన తర్వా త్రిప్తి డిమ్రిని లాక్ చేశారని టాక్‌ వినిపించింది. ఆ తరువాత జాన్వీ కపూర్‌తో ఐటెం సాంగ్ చేయిస్తే ఎలా ఉంటుందనే విషయంలో కూడా చర్చలు జరిగినట్లు టాక్‌ నడిచింది. ఇదంతా కాదు.. మళ్లీ సమంతనే ఐటెం సాంగ్ చేస్తుందనే టాక్ కూడా వినిపించింది. ఈ లిస్ట్‌లో ఇంకా చాలామంది హీరోయిన్లు పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు ప్రభాస్ హీరోయిన్‌ దాదాపుగా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది.

ప్రభాస్‌తో కలిసి సాహో సినిమాలో నటించిన బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ అయితే బాగుంటుందని సుకుమార్ భావిస్తున్నాడట. ఇటీవల శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్రలో వచ్చిన ‘స్త్రీ 2’ మూవీ బాలీవుడ్‌లో ఏకంగా 700 కోట్లు రాబట్టింది. దీంతో.. హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది. డ్యాన్స్ విషయంలోను శ్రద్ధా దుమ్ముదులిపేస్తుంది. ఇలాంటి బ్యూటీ అయితే బాలీవుడ్‌లో పుష్పరాజ్‌కు మరింత మైలేజ్ వస్తుందని చిత్ర బృందం అనుకుంటున్నారంట

ఎలాగు సాహో సినిమాతో శ్రద్దా తెలుగు ఆడియెన్స్‌కు పరిచయమే కాబట్టి.. ఇలా అన్ని విధాలుగా కలిసొస్తుందని అమ్మడి కోసం గట్టిగా ట్రై ట్రై చేస్తున్నారు మూవీ మేకర్స్‌. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుందని అంటున్నారు. ఇకపోతే.. ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప2 మూవీ డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles