ఆ హ్యూమారే నాది కూడా!

Saturday, January 18, 2025

డైరెక్టర్‌  శ్రీను వైట్ల డైరెక్షన్‌ లో యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా వస్తున్న కొత్త  సినిమా  ‘విశ్వం’. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా చేస్తోంది. అయితే, తాజాగా శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కామెడీ టైమింగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. శ్రీను వైట్ల ఏం మాట్లాడారు అంటే.. ‘నాలోని హ్యూమర్ ని నా చుట్టూ ఉన్న వారు బాగా ఎంజాయ్ చేస్తుంటారు.

అయితే, నాకు ఆ హ్యూమర్ రావడానికి కారణం మా ఇంట్లో నేను పెరిగిన వాతావరణ పరిస్థితులే. మా నాన్నగారు, మా పెద్దనాన్న గారు వీళ్ళిద్దరికీ కూడా బాగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. వాళ్ళు ఊరిలో మనుషులతో డీల్ చేసే విధానం చాలా సరదాగా ఉండేది. ముఖ్యంగా మా పెద్దనాన్న గారి క్యారెక్టర్ ఇంకా సరదాగా ఉంటుంది. బహుశా ఆయన హ్యూమరే, ఆయన టైమింగే నాకు వచ్చి ఉంటుంది’ అంటూ శ్రీను వైట్ల చెప్పుకొచ్చాడు.

 ఇక విశ్వం కథలో భాగంగా ఒక ట్రావెల్‌ ఎపిసోడ్‌ ఉంటుంది. అయితే, ‘వెంకీ’ ట్రైన్‌ ఎపిసోడ్‌ కంటే.. ఈ ఎపిసోడ్ ఇంకా అద్భుతంగా ఉంటుందట. అలాగే, ఇందులోని యాక్షన్‌ సీక్వెన్స్‌ ను ఇటలీ, రోమ్, గోవా వంటి ప్రాంతాల్లో చిత్రీకరించారు. అవి కూడా చాలా సహజంగా ఉంటాయట. కాగా విశ్వం సినిమాలో నరేష్, వెన్నెల కిషోర్, ప్రగతి, ప్రవీణ్, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో యాక్ట్‌ చేశారు. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles