యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా అలాగే కోలీవుడ్ యువ నటుడు జీవా కలయికలో రీసెంట్ గా వచ్చిన హారర్ కం మెడికల్ బ్యాక్ డ్రాప్ సినిమానే “అగత్యా”. దర్శకుడు పా విజయ్ తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ్ సహా తెలుగులో కూడా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అయితే ఈ చిత్రం అనుకున్న రేంజ్ లో రాణించలేదు కానీ కొన్ని హారర్ కం ఫాంటసీ ఎలిమెంట్స్ అలానే మన చరిత్ర అందులో సిద్ధ వైద్యానికి సంబంధించిన పలు షాట్స్ సినిమాలో డీసెంట్ గా అనిపించేలా చేసాయి.
ఇక ఫైనల్ గా ఈ చిత్రం ఇపుడు ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యేందుకు వచ్చేసింది. ఇక నేడు ఈ చిత్రం రెండు ఓటిటిలలో అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో సహా సన్ నెక్స్ట్ లో రాగా తెలుగు వెర్షన్ లో మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. సో అపుడు చూడకుండా ఇపుడు చూడాలి అనుకునేవారు వీటిలో ఈ చిత్రాన్ని ట్రై చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా ఇషారి కే గణేష్, అనీష్ అర్జున్ దేవ్ లు నిర్మాణం వహించారు.