జైలర్‌ 2 లో ఆ బ్యూటీ లేదు!

Thursday, January 2, 2025

సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా  నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్టర్‌ గా  తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘జైలర్’ అద్భుత విజయాన్ని అందుకుంది. అందుకే, ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌కు కొనసాగింపుగా ‘జైలర్‌ 2’ రాబోతున్న విషయం తెలిసిందే.అయితే, ‘జైలర్‌ 2’లో కేజీయఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి కీలక పాత్రలో నటిస్తోందని వార్తలు వినపడుతున్నాయి.

కాగా ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. ‘జైలర్‌ 2’లో ఇంకా శ్రీనిధి శెట్టిని ఫైనల్ చేయలేదని, ఒకవేళ ఆమెను ఫైనల్ చేస్తే.. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తాం అని చిత్ర బృందం చెప్పినట్లు తమిళ మీడియాల్లో కథనాలు వినపడుతున్నాయి.

మొత్తానికి ప్రస్తుతానికి అయితే, రజినీకాంత్ సినిమాలో శ్రీనిధి శెట్టి ఇంకా ఫైనల్ కాలేదని ఓ క్లారిటీ అయితే వచ్చింది. ఇక ‘జైలర్‌ 2’ చిత్రీకరణ గురించి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇక ఈ ‘జైలర్ 2’లో కూడా తమన్నా, యోగిబాబు, వినాయకన్, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ జైలర్ 2 ను కూడా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.ప్రస్తుతం రజనీకాంత్‌ ‘కూలీ’ సినిమాతో బిజీగా ఉన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles