మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, విక్టరీ వెంకటేష్ కాంబోలో కొత్త సినిమా త్వరలో ప్రారంభం అయ్యే వార్త పలు మీడియా వేదికల ద్వారా బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి ఫిక్స్ అయ్యారు. టాలీవుడ్‌లో ‘హిట్-3’ హిట్‌తో గుర్తింపు పొందిన శ్రీనిధి, రీసెంట్‌గా ‘తెలుసు కదా’ చిత్రంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా క్యాస్టింగ్ విషయాన్ని అధికారికంగా యూనిట్ ప్రకటించింది.
వెంకటేష్ లాంటి సీనియర్ హీరోతో కాంబినేషన్‌లో శ్రీనిధి నటించడంతో సినిమా పై ఆసక్తి ఎక్కువగా పెరిగింది.
