థాంక్యూ బ్రదర్..!

Thursday, December 19, 2024

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌ లో  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ‘పుష్ప 2 ది రూల్’ గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే, విడుదలైన ఈ ట్రైలర్ అద్భుతంగా అలరిస్తోంది. ఈ క్రమంలో ‘పుష్ప 2’ ట్రైలర్‌ మీద కిరణ్ అబ్బవరం ట్వీట్ చేశాడు.

వైల్డ్ ఫైర్.. డిసెంబర్ 5 కోసం వెయిటింగ్ అంటూ  ట్వీట్ లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌కు బన్నీ రిప్లై ఇచ్చాడు. థాంక్యూ బ్రదర్.. బిజీగా ఉండటం వల్ల మీ సినిమాను చూడలేకపోయా.. క్షమించండి.. నేను క మూవీని చూసి మీకు కాల్ చేస్తా అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.దీనికి మళ్లీ కిరణ్ అబ్బవరం స్పందిస్తూ థాంక్యూ అన్నా అని రిప్లై ఇచ్చాడు. ఇక కిరణ్ అబ్బవరం దీపావళికి క మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

కాగా పుష్ప మూవీలో నేషనల్ క్రష్ రష్మిక  హీరోయిన్ గా చేస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ తో పాటు తమన్ కూడా సంగీతం సమకూరుస్తున్నాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles