బాలీవుడ్‌ కి గదర్‌..టాలీవుడ్‌ కి తండేల్‌!

Monday, December 15, 2025

బాలీవుడ్‌ కి గదర్‌..టాలీవుడ్‌ కి తండేల్‌! ప్రేమ కోసం మన హీరోలు దేనికైనా రెడీ అవుతున్నారు. వారు ఎలాంటి పరిస్థితులు కూడా దాటుకుని తమ ప్రేమను సాధించుకుంటారు. ఇలాంటి కథలు చాలా సినిమాల్లో కనిపించిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని లవ్ స్టోరి సినిమాల్లో మాత్రం ఈ ప్రేమ కోసం హీరోలు ఏకంగా దేశం సరిహద్దులు దాటారు. తాజాగా టాలీవుడ్‌లో తెరకెక్కిన తండేల్ చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.

ఈ ట్రైలర్ చూస్తే హీరో పాకిస్థాన్ దేశంలో యాక్షన్ చేయనున్నట్లు చూపెట్టారు. దీంతో ఈ సినిమాలో హీరో దేశం సరిహద్దు దాటి తన ప్రేమను తిరిగి ఎలా సాధించుకుంటాడనేది మనకు ఈ సినిమాలో కూడా చూపించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే, ఈ ప్రేమ కథను డైరెక్టర్‌ చందూ మొండేటి ఎలా తీర్చిదిద్దాడనేది మనం సినిమా విడుదల అయ్యాకే చూడగలం.

కాగా, ఇలాంటి కాన్సెప్ట్‌తో గతంలో బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘గదర్’ చిత్రం కూడా చాలా మందికి తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్ ప్రేమ కోసం హీరో ఏకంగా పాకిస్థాన్‌లోని లాహోర్ వరకు వెళ్లి అక్కడ యుద్ధం చేస్తాడు. ఆ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇప్పుడు ఇదే తరహా పాయింట్ తండేల్‌లో ఉండనుండటంతో టాలీవుడ్‌కి ఇది మరో గదర్ కానుందని అభిమానులు భావిస్తున్నారు. మరి గదర్ స్థాయిలో తండేల్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో లేదో చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles