సెన్సార్‌ ముగించుకున్న తండేల్‌!

Thursday, February 20, 2025

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘తండేల్’ మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి పీరియాడిక్ నేపథ్యంలో ఓ చక్కటి లవ్ స్టోరీ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు వేరే లెవల్‌ లో  క్రియేట్ అయ్యాయి.

ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల కావడంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా కథ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.

కాగా ఈ చిత్రానికి టైటిల్ కార్డ్స్, యాడ్స్ కలుపుకుని 2 గంటల 32 నిమిషాల నిడివి ఉండబోతున్నట్లు చిత్ర బృందం చెప్పింది.దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌  అందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles