పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ “ది రాజా సాబ్” సినిమా కోసం ఫ్యాన్స్ లో అంచనాలు గగనానికి చేరుకున్నాయి. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక అప్‌డేట్ లు రానున్నాయని ఇప్పటికే తెలిసింది. అందులో మొదటి సింగిల్ కూడా ఒక ముఖ్య ఆకర్షణగా నిలవనుంది.
ఇక ఈ అప్‌డేట్ పై సంగీత దర్శకుడు థమన్ మరింత హీట్ పెంచుతున్నాడు. అక్టోబర్ 23న మ్యూజికల్ ట్రీట్ రానుందని సూచిస్తూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాడు. దీంతో ప్రభాస్ అభిమానులు ఆ పాట కోసం పెద్ద ఎగ్జైట్‌మెంట్ లో ఉన్నారు.
సంజయ్ దత్ ఈ సినిమాలో కీలకమైన పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు. మరోవైపు ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తూ అభిమానులను కొత్తగా ఆకట్టుకోనున్నాడని సమాచారం.
