ఆమెకు డైమండ్‌ రింగ్‌ బహుమతిచ్చిన తలైవా!

Sunday, December 22, 2024

కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్‌ ప్రస్తుతం ‘ది గోట్’ మూవీ చేస్తూనే.. రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నాడు. వీటితో పాటు విజయ్‌ సామాజిక సేవలో కూడా ఎప్పుడు ముందు ఉంటాడు. ఎక్కువగా విద్యార్థులను ప్రోత్సహించే విజయ్.. టెన్త్, ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు తెచ్చుకున్న వారిని సన్మానించి బహుమతులు అందిస్తుంటాడు. ఈ క్రమంలోనే గతేడాది తమిళనాడు టాపర్‌కు డైమండ్ నెక్లస్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇప్పుడు మరోసారి విజయ్‌ తన పెద్ద మనసును చాటుకున్నాడు.ఈ మేరకు.. తమిళనాడులోని నియోజకవర్గాల వారీగా ఈ ఏడాది టెన్త్, ఇంటర్ ఫలితాల్లో టాప్ 3లో నిలిచిన విద్యార్థులకు సన్మానం చేసి బహుమతులు అందించాడు. అంతే కాకుండా.. ఈ ఏడాదిలో టాపర్‌గా నిలిచిన విద్యార్థికి డైమండ్ రింగ్ బహుమతిగా ఇచ్చారు. తొలి విడతగా జరిగిన ఈ కార్యక్రమంలో 750 మంది విద్యార్థులతో పాటు 3500 మంది తల్లిదండ్రులు, ఇతరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ‘పది, ఇంటర్ ఫలితాల్లో విజయం సాధించిన నా తమ్ముళ్లకు, సోదరీమణులకు నా హృదయపూర్వక అభినందనలు. ప్రతి విద్యార్థి మీకు నచ్చిన కోర్సులో చేరండి. అనుకున్నది సాధించే వరకు పోరాడండి. డ్రగ్స్ వంటి చెడు అలవాట్లుకు బానిసలు కాకుండా దూరంగా ఉండండి. సమాజంలో ఏం జరుగుతుందో ఎప్పుడికప్పుడు తెలుసుకుంటూ వార్తలు చూస్తూ , తెలుసుకుంటూ ఉండండి. భవిష్యత్‌లో రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయంగా క్రియాశీలకంగా మారాలి’ అంటూ పేర్కొన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles