అదిరిపోయే రేంజ్‌ లో మిరాయ్ టీజర్‌!

Friday, December 5, 2025

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ “హను మాన్” తో అందించిన పెద్ద విజయానికి కొనసాగింపుగా మరొక భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే సినిమా “మిరాయ్”. ఈ ప్రాజెక్ట్ కు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు షూటింగ్ కొంచెం ఎక్కువ టైమ్ తీసుకున్నా, ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచాయి.

ఇప్పుడు మేకర్స్‌ ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. ఇది ప్రేక్షకుల అంచనాలను దాటిపోయేలా ఉంది. టీజర్ చూస్తే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్టు అనిపిస్తోంది. మనకు ఇండియన్ సినిమా నుండి పెద్ద సినిమాలు చాలానే వస్తాయి, కానీ ఎక్కువగా గ్రాఫిక్స్ మాత్రమే హైలైట్ అవుతాయి. కానీ ఈ “మిరాయ్” అయితే వాటి కంటే భిన్నంగా కనిపిస్తోంది.

విజువల్ ఎఫెక్ట్స్ పరంగా హాలీవుడ్ స్థాయి క్వాలిటీ ని చూపిస్తుంది. మనోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లోనైనా, తేజ సజ్జ ఉన్న సీన్లలోనైనా ఎక్కడా కూడా కాంప్రమైజ్ చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ సినిమాల్లో సాధారణంగా వచ్చే కాన్సెప్ట్ కు అందని కొత్తదనాన్ని ఈ సినిమాలో చూడొచ్చు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles