యంగ్ హీరో తేజ సజ్జ కథానాయకుడిగా, రితికా నాయక్ కథానాయికగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన తాజా చిత్రం మిరాయ్ మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. తక్కువ బడ్జెట్‌తో రూపొందించినప్పటికీ, విజువల్స్ నుంచి టెక్నికల్ వర్క్ వరకు అన్నీ పెద్ద సినిమాలా ఉండటంతో ప్రేక్షకులు ఆకట్టుకున్నారు. దేశీయ మార్కెట్‌తో పాటు అమెరికాలో కూడా ఈ సినిమా బలమైన కలెక్షన్లు సాధిస్తోంది.
ప్రస్తుతం యూఎస్ బాక్సాఫీస్‌లో మిరాయ్ 2.9 మిలియన్ డాలర్ల వసూళ్లను దాటేసింది. ఇక చాలా త్వరలో 3 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరే అవకాశం కనిపిస్తోంది. ఈ స్థాయి విజయంతో నిర్మాతలకు మంచి లాభాలు వచ్చినట్టే అని చెప్పాలి.
ఈ చిత్రానికి గౌరహరి సంగీతం అందించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది.
