మిరాయ్‌ గా వస్తున్న తేజ సజ్జా!

Saturday, January 18, 2025

టాలీవుడ్‌ యంగ్‌ హీరో తేజ సజ్జా ఈ ఏడాది సంక్రాంతికి హనుమాన్‌ సినిమాతో తన సినీ కెరీర్‌ లో నే బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ ను అందుకున్న విషయం తెలిసిందే. యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాతో తేజ సజ్జాకు వరుస సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి.
అతి త్వరలోనే “జై హనుమాన్” సినిమాతో వీరి ఈ సూపర్ హిట్ కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

కానీ అంతకంటే ముందే తేజా సజ్జా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయాడు. యంగ్ డైరెక్టర్ ఘట్టమనేని కార్తీక్ తో  తేజ సజ్జా సినిమా చేస్తున్నవిషయం తెలిసిందే. ఇటీవల ఈగల్ వంటి యాక్షన్‌ సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్న కార్తీక్ ఇప్పుడు తేజ సజ్జాను కొత్త కోణంలో,   కథలో చూపించేందుకు సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ మూవీ నుంచి  ప్రీ లుక్ పోస్టర్ తో  ‘ఒక యోధుడి గొప్ప సాహసం’ అంటూ చెప్పుకొచ్చిన చిత్ర యూనిట్ మూవీ టైటిల్ , గ్లింప్స్ ఏప్రిల్ 18 న ప్రకటిస్తామన్న సంగతి తెలిసిందే.  తాజాగా ఆ చిత్ర గ్లింప్స్ ని గురువారం  ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. కళింగ యుద్ధం తరువాత యుద్ధం వదిలి యోగిగా మారిన అశోకుడు రహస్యంతో ఈ సినిమా కథాంశం ప్రారంభం అవుతుంది. అశోకుడిని యోగిగా మార్చిన ఓ అద్భుత గ్రంథం కోసం జరిగే పోరాటమే ఈ సినిమా కథ అని తెలుస్తుంది.

అశోకుడు వద్ద ఉన్న తొమ్మిది గొప్ప గ్రంథాలతో సిద్ధం చేసిన ఆ అద్భుత గ్రంథాన్ని దక్కించుకోవడం కోసం కొంత మంది ప్రయత్నిస్తుంటారు. అయితే ఆ గ్రంథాన్ని కాపాడే యోధుడి పాత్రలో తేజ సజ్జా నటించనున్నాడు.అలాగే ఈ సినిమాకి ‘మిరాయ్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ నిచిత్ర బృందం ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఆ గ్లింప్స్ చూసాక తేజ సజ్జా ఈ సారి హనుమాన్ మూవీకి మించిన  సక్సెస్ అందుకోనున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమాలో రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే మంచు మనోజ్ ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నట్లు టాక్‌. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 18న రిలీజ్ చేయబోతున్నట్లు డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles