తారక్‌ యూ ఆర్‌ ద రియల్‌ గ్లోబల్‌ స్టార్‌!

Sunday, December 22, 2024

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ – హృతిక్‌ రోషన్‌ కలయికలో రాబోతున్న సినిమా వార్‌ 2. గత వారం ఎన్టీఆర్‌ ఈ సినిమా షూటింగ్‌ లో పాల్గొనేందుకు ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే.  ఈ  సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు టాక్‌ నడుస్తుంది. ఎందుకంటే తాజాగా ఊర్వశి రౌతేలా ఎన్టీఆర్ తో తీసుకున్న సెల్ఫీని ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

ఈ ఫోటోలో ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా క్లాస్‌ లుక్‌ లో కనిపిస్తున్నాడు.  దీంతో ఈ పిక్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అన్నట్టు ఎన్టీఆర్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఓ క్రేజీ కామెంట్ పెట్టింది. ‘ఎన్టీఆర్ గారు.. మీరే నిజమైన గ్లోబల్ సూపర్ స్టార్. మీ క్రమశిక్షణ, మీ వ్యక్తిత్వం గొప్ప ప్రశంసనీయం. త్వరలో మీతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని పేర్కొంది. దీంతో వార్ 2 లో ఊర్వశి రౌతేలా కూడా నటిస్తున్నట్లు ఓ క్లారిటీ వచ్చేసింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles