తారక్‌ అడుగు పెట్టేశాడు!

Wednesday, October 9, 2024

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్‌ లో  పెద్ద సెన్సేషన్‌. ఒక రొటీన్‌ రెగ్యులర్‌ సినిమాకి కూడా సూపర్‌ కలెక్షన్స్‌ రాబట్టాలంటే అది ఒక్క ఎన్టీఆర్‌ కే సాధ్యం. ఈ విషయాన్ని తాజాగా విడుదలైన దేవర మరోసారి నిరూపించింది. విడుదల నాడు దేవర కు సోషల్ మీడియాలో జరిగిన నెగిటివ్ ట్రెండ్ వేరే ఏ సినిమాకైనా జరిగి ఉంటె మాట్ని షో నుండే ఖాళీ అయిపోయేవి.

అంతటి నెగటివ్ దేవర విషయంలో జరిగింది. కానీ కలెక్షన్స్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం యంగ్ టైగర్ రెండు సినిమాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి ప్రశాంత్ నీల్ సినిమాగా మరోటి బాలీవుడ్ సినిమా వార్ – 2. ప్రస్తుతం వార్ -2 సినిమా షూటింగ్‌  శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం చిత్ర బృందం తారక్ లేని సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు.

ఇప్పటికే దేవర జోష్ లో ఉన్న తారక్ అదే జోష్ లో వార్ – 2 షూట్ లో పాల్గొనేందుకు సిద్దంగా ఉన్నాడు. ఈ అక్టోబరు రెండవ వారంలో ఈ భారీ బడ్జెట్ సినిమాలో తారక్ జాయిన్ అవుతాడని బాలీవుడ్ వర్గాలు ఇపపటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. హృతిక్, ఎన్టీఆర్ మధ్య వచ్చే సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉంటాయని యూనిట్ వర్గాలు తెలిపాయి.

అలాగే ఈ చిత్రంలో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ కాంబోలో ఓ గ్రాండ్ సాంగ్  కూడా ఉంటుందని ఆ సాంగ్ లోని డాన్స్ సినిమాకే హైలైట్ గా ఉంటుందని సమాచారం. అసలే డాన్స్ లాతో అదరగొట్టే ఈ హీరోలు ఒకేఫ్రేమ్ లో నాట్యం ఆడితే ఫాన్స్ కు అదొక విజువల్ ట్రీట్‌ లా  లా ఉండబోతుంది అని చెప్పడంలో సందేహమే లేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles