మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ “వార్ 2” తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ క్రియేట్ చేసింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ ప్రీరిలీజ్ వేడుక తెలుగు రాష్ట్రాల్లో నేడు అద్భుతంగా జరిగింది.
ఈ ఈవెంట్‌లో తారక్ మాటలు అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ఇంతకు ముందు తన అభిమానులకు సింగిల్ కాలర్ ఎత్తి, ఎప్పుడూ వారిని గర్వపడేలా కష్టపడతానని హామీ ఇచ్చిన ఎన్టీఆర్, ఈ సారి ఆ ఉత్సాహాన్ని మరింత పెంచేశాడు. వార్ 2 స్టేజ్ పై ఆయన డబుల్ కాలర్ ఎత్తడంతో వేదిక మొత్తం హర్షధ్వానాలతో మార్మోగింది.
అంతే కాదు, ఆ మూమెంట్‌లో హృతిక్ రోషన్ కూడా తారక్‌తో పాటు డబుల్ కాలర్ ఎత్తడంతో ఆ సీన్ ఈ ఈవెంట్‌లో అత్యంత స్పెషల్‌గా మారింది. ఇద్దరి కలయికలో వచ్చిన ఆ ఫ్రేమ్ సోషల్ మీడియాలో పిక్ ఆఫ్ ది డేగా మారి క్షణాల్లో వైరల్ అయింది. అభిమానులు ఈ ఫోటోలు షేర్ చేస్తూ వార్ 2పై మరింత హైప్ పెంచుతున్నారు.
