తారక్‌ నాకు మంచి స్నేహితుడు!

Sunday, December 22, 2024

భారత క్రికెటర్లకు ఎంత క్రేజ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా హీరోల కంటే కూడా ఎక్కువ  ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే క్రికెటర్స్ ,సినిమా హీరోల మధ్య మంచి బాండింగ్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అది కూడా బాలీవుడ్ హీరోలతో మరింత ఎక్కువగా ఉంటుంది. సినీ సెలెబ్రెటీల పార్టీలకు ,ఫంక్షన్స్ కు క్రికెటర్లు  హాజరవుతూ వుంటారు. అలాగే ఐపీఎల్,వరల్డ్ కప్ వంటి వేడుకలలో   సినీ తారలు పాల్గొని ఎంతో సందడి చేస్తుంటారు. దీనికి ముంబై వాణిజ్య రాజధాని కావడం కూడా మరో కారణం కావొచ్చు.

 ఎందుకంటే ముంబైతో క్రికెటర్ల అసోసియేషన్ ఎక్కువగా ఉంటుంది.దాంతో బాలీవుడ్ స్టార్స్ తో క్రికెటర్స్ కు మంచి బాండింగ్ ఉంటుంది.

  అయితే ఈ మధ్య కాలంలో తెలుగు హీరోల సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయం సాధిస్తుండటంతో క్రికెటర్స్ తెలుగు హీరోలతో కూడా మంచి బాండింగ్ ఏర్పరచుకుంటున్నారు.

తాజాగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ గురించి టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర విషయాలు చెప్పాడు. తెలుగు సినిమా హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ నాకు మంచి స్నేహితుడు అని విరాట్ పేర్కొన్నాడు.ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టమని వివరించాడు.అయితే నేను కొన్నాళ్ల క్రితం ఎన్టీఆర్ తో ఒక యాడ్ లో నటించాను. ఆ సమయంలో అతని వ్యక్తిత్వం ,అతను మాట్లాడే తీరు నాకు ఎంతగానో నచ్చిందని కోహ్లీ వివరించాడు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles