జపాన్‌ లో తారక్‌ బిజీ బిజీ..!

Thursday, March 27, 2025

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక దేవర పాత్రలో ఎన్టీఆర్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలోని కథ, యాక్షన్, సాంగ్స్ ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టేలా చేశాయి.

ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా జపాన్ భాషలో సందడి చేస్తుంది. జపాన్ దేశంలో ఈ చిత్రాన్ని తాజాగా రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ‘దేవర’ చిత్రాన్ని జపాన్ దేశంలో ప్రమోట్ చేసేందుకు హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ అక్కడికి వెళ్లారు. ఇక తాజాగా ఈ చిత్ర ప్రీమియర్ షో సందర్భంగా అభిమానులతో కలిసి ఎన్టీఆర్ సందడి చేశారు.

దేవర చిత్రం యూనివర్సల్ ప్రేక్షకులను ఆకట్టుకునే మూవీ అని.. ఈ సినిమాకు ఇండియన్ ప్రేక్షకులు మంచి రెస్పాన్స్ అందించారని.. ఇప్పుడు జపాన్ సినిమా లవర్స్ కూడా ఈ చిత్రాన్ని చూసి ఆదరిస్తారని ఎన్టీఆర్ కోరారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉందని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించడంతో, ఈ సీక్వెల్ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles